కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా పనిచేయాలి – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం జిల్లా పోలీసు విభాగంలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశమయ్యారు.ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోర్టు డ్యూటీ అధికారులకు సూచించారు.న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చేలా భాద్యతగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ప్రస్తుతం కోర్టు డ్యూటీ అధికారులకు విధులలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి,సిఐ వెంకటేశ్వర్లు, మణుగూరు సీఐ రమాకాంత్, ఎస్బి ఇన్స్ పెక్టర్ నాగరాజు, కొత్తగూడెం టూ టౌన్ సీఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.