ఖమ్మంతెలంగాణ

బిజెపి ఆర్ఎస్ఎస్ లను ఓడించండి

బిజెపి, ఆర్ఎస్ఎస్ లను ఓడించండి
ఖమ్మం, శోధన న్యూస్: బడా కార్పొరేట్ వర్గాలు అదాని,అంబానీలకు అనుకూలంగా భారతదేశాన్ని, ప్రజలను మధ్యయుగాలలోకి తీసుకుపోవ డానికి మూఢనమ్మకాలను, మనువాద చాందస భావాలను నూరిపోస్తూన్నారని, భారత రాజ్యాంగాన్ని మార్చి వేయటానికి కుట్రలు జరుగుతున్నాయని మతోన్మాద జినోసైడ్ నుండి లౌకిక విలువలను కాపాడుకొనుటకు 18వ పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఆర్ఎస్ఎస్ దాని మిత్రపక్షాలను ఓడించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు.ఖమ్మంలో రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చెల రంగారెడ్డి అధ్యక్షత ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జనరల్ బాడీ జరిగింది. ఈ జనరల్ బాడీ సమావేశానికి పోటు రంగారావు ముఖ్యవక్త గా ప్రసంగిస్తూ భారతదేశ వందల వేల సంవత్సరాల నుండి అన్ని మతాలకు నిలయమైనదని, అంటరాని వారు ముస్లింలలో, క్రిస్టియన్లలో చేరారని, నేడు బిజెపి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, చరిత్రకారులు, లౌకికవాదులకు వ్యతిరేకమైన చర్యలను చేపట్టి విధ్వంస రచనకు పూనుకున్నదని విమర్శించారు. మైనార్టీలకు పౌ రసత్వం లేదంటున్నారని, గుజరాత్,అహ్మదాబాద్, మణిపూర్ లలో మైనార్టీలను ఊచకోత కోశారని, వారసత్వాన్ని నిరూపించుకోవాలని లేనియెడల, కాన్సన్ట్రేషన్ క్యాంపులలో బంధించడానికి అస్సాంలో జైళ్ల ను కట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే ఫాసిస్టు సిద్ధాంతమని, మెజారిటీ మైనార్టీలుగా ప్రజలను విభజిస్తూ, కుల వ్యవస్థను పోషిస్తూన్నారనీ, శ్రమజీవుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని, బ్రిటిష్ వాళ్ళను వ్యతిరేకించలేదని, మూడు రంగుల జెండాను ఎగురవేయలేదని, జర్మనీలో హిట్లర్ నరమేధం కొనసాగించినట్లుగా ఆర్ఎస్ఎస్ నేడు దేశంలో నరమేధాన్ని కొనసాగిస్తుందని, ఫాసిజం వస్తే కనీస ప్రజాసామిక హక్కులు ఉండవని, ప్రతిపక్షాలను కూడా ఉండనివ్వరని, ప్రతిపక్షాలపై సిబిఐ, ఈడి,ఐటి లను ఉపయోగించి అణచి వేస్తుందనీ ఆయన ఆవేద వ్యక్తం చేశారు. అస్సాం ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ అశోక్ చౌహన్, సి ఎం రమేష్ లపై అవినీతి ఆరోపణలు వస్తే బిజెపిలో చేర్చుకున్నారని, వారు వెంటనే సుద్దులు అయిపోయారని, విలువల గురించి మాట్లాడటం హాస్య స్పదంగా ఉందనిఆయన విమర్శించారు. ప్రశ్నించిన రచయితలను జర్నలిస్టులనుభీమా కోరేగాం కేసులో ఇరికించి జైళ్లల్లో పెట్టినారనీ, సుధా భరద్వాజ్,సోమాసేన్, అరుణ్ ఫెరిరాలను నిర్భంధిస్తున్నారని ఆయన అన్నారు. ఉ పా కేసులు అమాయక ప్రజలపై మోపుతున్నారనిఆయనన్నారు. బిజెపి ఫాసిస్టు పార్టీ 100 సంవత్సరాల నుండి స్కూలు శాఖలో నిర్వహిస్తుందనీ, రామరాజ్యం తెస్తాననీ హింసా కాండను తెస్తుందనిఆయనన్నారు. ఇండియాలో ఆధునిక ఫాసిజం అమలవుతుందని, దేశంలో నరమేదాన్ని అమలు చేస్తున్నారని జస్టిస్ లోయను అమి త్ షా నాయకత్వంలో హత్య చేశారని, కనీస పార్లమెంటరీ బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఫాసిజాన్ని ఓడించేది కార్మిక వర్గ ఐక్య పోరాటాలు అనీ, దేశంలో కార్మికులు కర్షకులు పేదలు మతోన్మాద పాసిస్ట్,కార్పొరేటు కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తూ బిజెపి ఆర్ఎస్ఎస్ దాని మిత్రపక్షాలను ఓడించడానికి ఇండియా కూటమికి ఓటేయాలని ఆయన ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *