పంప్ హౌజ్ పవర్ సప్లయ్ ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
పంప్ హౌజ్ పవర్ సప్లయ్ ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంట గ్రామపంచాయతీ భీమునిగుండం కొత్తూరు గ్రామం వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పంపు హౌజ్ పవర్ సప్లయ్ ని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రారంభించారు. రాష్ట్ర మంత్రుల బృందం సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా పంప్ హౌజ్ పవర్ సప్లయ్ ని కొబ్బరికాయ కొట్టి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం పంప్ హౌజ్ ను దానిలో అమర్చిన మోటర్లను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ సంబంధించిన వివరాలను సంబంధిత సీతారామ ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు .పంపు హౌస్ కు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, మహబూబాద్ ఎంపీ పొరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.