తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నిషేధిత సిపిఐ మావోయిస్టు మిలీషియా డిప్యూటీ కమాండర్ అరెస్ట్

నిషేధిత సిపిఐ మావోయిస్టు మిలీషియా డిప్యూటీ కమాండర్ అరెస్ట్

– భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్

దుమ్ముగూడెం, శోధన న్యూస్ :  నిషేధిత సిపిఐ మావోయిస్టు మిలీషియా డిప్యూటీ కమాండర్ అరెస్ట్ చేసినట్లు భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ తెలిపారు. ఇందుకు సంబందించిన వివరాలను ఆయన విలేకరుల సమావేశంలో  వెల్లడించారు. దుమ్ముగూడెం పోలీసులు, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ సిబ్బంది దుమ్ముగూడెం మండలం పైడిగూడెం దగ్గర సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చతిస్గడ్ రాష్ట్రం కిష్టారం పిఎస్ పరిధి సాకిలేరు ఆర్ పీసి కి చెందిన నిషేధిత సిపిఐ మావోయిస్టు మిలీషియా డిప్యూటీ కమాండర్  కారం వెంకటేష్  ను అరెస్టు చేయడం జరిగిందన్నారు.  అరెస్ట్ కాబడిన పై  కారం వెంకటేష్  బాల్యం నుండే నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన బాలల సంఘంలో సభ్యుడిగా పని చేస్తూ, 2017 వ సంవత్సరంలో సాకిలేరు ఆర్ పీసీ మిలీషియ సభ్యుడిగా నియమించబడ్డాడని. 2022 వ సంవత్సరంలో మిలీషియ డిప్యూటీ కమాండర్ గా ప్రమోషన్ పొంది, మిలీషియ సభ్యుడుగా ఉన్నప్పుడు బర్మర్ తుపాకిని, డిప్యూటీ కమాండ్ గా ఉన్నప్పుడు 12 బోర్ తుపాకిని కలిగి ఉండేవాడని ఏఎస్పి తెలిపారు. ఇతడు 2017లో సాకిలేరు గ్రామం వద్ద పోలీసులకి మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనతో పాటు ఇటీవల పోటాకపాళ్ళీ, దుబ్బమరక సిఆర్పిఎఫ్ క్యాంపు లపై అటాక్ చేసిన ముఖ్యమైన ఘటనలతో పాటు పలు నేరాల్లో పాల్గొన్నాడన్నారు. అరెస్టు కాబడిన పై వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం భద్రాచలం కోర్టు నందు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. గత కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఆదివాసి ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయి ఛత్తీస్గడ్ రాష్ట్రంలో అడవి ప్రాంతానికి మాత్రమే పరిమితమై, కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటుగా కమిటీలను ఏర్పాటు చేసి బలవంతపు వసూలే లక్ష్యంగా పనిచేస్తూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే రోడ్లను ధ్వంసం చేయడం, సెల్ఫోన్ టవర్లను కాల్చి వేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయక ఆదివాసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.   ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ ఆదివాసి ప్రజల అభివృద్ధికి ఆటంకంగా మారిన నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యులపై శాఖ పరంగా  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగాలొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు గాని, మీలీషియా సభ్యులకు గానీ  స్వయంగా గాని లేదా కుటుంబ సభ్యుల ద్వారా గాని మీకు సమీప పోలీస్ స్టేషన్ అధికారులను గానీ లేదా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను గాని సంప్రదించగలరని విజ్ఞప్తి చేశారు.  లొంగిపోయే దళ సభ్యులకు మీలీషియా సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి భద్రాచలం పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో  141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ కమాండెంట్ ఎంఎస్ ప్రీతా, దుమ్ముగూడెం సిఐ బి అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *