తెలంగాణమధిర

మధిర నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా  

మధిర నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా  

-కొదుమూరు వందనం లిఫ్ట్ ఇరిగేషన్ కు 25 కోట్లు మంజూరు

-ఇల్లు లేని పేదలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు 

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-రూ.4  కోట్లతో   రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన 

మధిర, శోధన న్యూస్ :  మధిర నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం వందనం గ్రామంలో నాలుగు కోట్ల రూపాయలతో వందనం- పుట్టకోట గ్రామాల మధ్యన బీటీ రోడ్డు నిర్మాణానికి వందనం గ్రామం వద్ద శంకుస్థాపన చేశారు.రూ. 2కోట్ల 70 లక్షలతో చింతకాని మండలం రేపల్లెవాడపాతర్లపాడు నుండి గోవిందపురం వరకు బిటి రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. నిర్దేశిత గడువులోగా ఈ పనులను పూర్తి చేస్తామన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.

చింతకాని మండలం రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించడానికి 25 కోట్ల రూపాయలతో కోధుమూరు- వందనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్ఎస్పిఎల్ నీళ్ల ద్వారా రైతుల పొలాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుందని తెలిపారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు  పేర్కొన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ  ఇండ్లను మంజూరు చేస్తామన్నారు.  వారంలో రెండు రోజులు మదిర నియోజకవర్గంలో పర్యటన చేసి ఏ ఆటంకం లేకుండా అభివృద్ధి పనులను నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. మిగతా ఐదు రోజులు మధిర శాసనసభ్యుడిగా డిప్యూటీ సీఎం గా రాష్ట్ర పాలనలో భాగస్వామ్యం అవుతూ మిగత జిల్లాల్లో పర్యటిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మండల నాయకులు అంబటి వెంకటేశ్వర్లు కూరపాటి కిషోర్ కిలారి మనోహర్ మడిపల్లి భాస్కర్ బందెల నాగార్జున్ ఆవుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *