దేశ వ్యాప్త సమ్మెకు మద్దతుగా బిటిపిఎస్ లో ధర్నా
దేశ వ్యాప్త సమ్మెకు మద్దతుగా బిటిపిఎస్ లో ధర్నా
మణుగూరు, శోధన న్యూస్:
దేశ వ్యాప్త సమ్మెకు మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని లోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్) లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్(టీఎస్ పిఈ) జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రసంగిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బి రవి ప్రసాద్, సిహెచ్ రాజబాబు, కార్మిక సంఘం-1104 ప్రధాన కార్యదర్శి బి సత్యనారాయణ నాయకుల వెంకట్రామ్, కార్మిక సంఘం 327 అధ్యక్షులు ప్రేమ్ కుమార్, నాయకులు కే ప్రేమ్ ప్రకాష్, కార్మిక సంఘం- 1535 అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి ప్రసాద్, ఆర్. రామచందర్, సిఐటియు నాయకులు వీరస్వామి, మహిళా నాయకురాలు అల్తాఫా తదితరులు పాల్గొన్నారు.