జీవో నెంబర్ 10రద్దుచేయాలని ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా
జీవో నెంబర్ 10రద్దుచేయాలని ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా
మణుగూరు, శోధన న్యూస్ : జీవో నెంబర్ 10రద్దుచేసి. 18 వేల రూపాయలు జీతం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ మణుగూరు బూర్గంపాడు ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కేంద్రంలోని పినపాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వి అప్పారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ల ను ప్రభుత్వం అన్ని పనులకు వాడుకుంటూ వారి జీతాల పట్ల వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపించడం లేదని అన్నారు. జీవో నెంబర్ 10 రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కి రెండు లక్షలు తెలపరకు లక్ష పెంచి టిఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలని అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ 18000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించి పిఆర్సి వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య లక్ష్మి, అంగన్వాడి ఉద్యోగులకు ఆసరా, కళ్యాణ లక్ష్మి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడి హెల్పర్ల సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా మోడీ కేంద్రంతో ముడిపడి ఉన్నాయని, సమస్యలు పరిష్కారం కోసం మంత్రి సీతక్కని. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విశాఖలో ప్రధాన కార్యదర్శి నా లెటర్ ప్యాడ్ తో. పంపిస్తానని తెలియజేస్తూ అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పారు వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సమస్యలు పరిష్కరించని ఎడల కార్మికుల ఆధ్వర్యంలో సీఐటీయూ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సింగరేణి రాష్ట్ర కమిటీ సభ్యులు నెల్లూరు నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు, జిల్లా నాయకులు సత్ర పల్లి సాంబశివరావు, కొమరం కాతారావు, అంగన్వాడి జిల్లా నాయకురాలు పి హేమలత, కే సావిత్రి, హేమలత, అనసూర్య, భవాని, ప్రమీల, సుజాత, నాగమణి, సావిత్రి, హెల్పర్లు మల్లీశ్వరి, యశోద, రమణ, నాగమణి, సులోచన, లీల, జమునిషా విజయ తదితరులు పాల్గొన్నారు.