పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఆద్వర్యంలో సామాగ్రి వితరణ
పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఆద్వర్యంలో సామాగ్రి వితరణ
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ విఠల్ రావునగర్ ప్రాంతానికి చెందిన జర్పుల హత్తి రామ్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు బేతంచెర్ల వెంకటేశ్వర్లు సారధ్యంలో సుమారు 10 వేల రూపాయల వంట సామాగ్రి గిన్నెలు, అలాగే ఊటుకూరి సత్యనారాయణ మిత్రులు, 25 కేజీల బియ్యం, రంగా హోమ్ నీడ్స్ వారు దిండ్లు, బీరువా షాపు వాసు దుప్పట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం సభ్యులు సాయి భార్గవ్, సురేందర్ పటేల్, బత్తుల అనిల్ కుమార్, ప్రదీప్ కుమార్ బండ్ల బాల, జెట్టి యుగంధర్, సాయిని బాలయ్య, డేరంగుల నరసింహ, అమూల్ శ్రీనివాస్, జనసేన అభిమానులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.