రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 13 (శోధన న్యూస్ ప్రతినిధి):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో నిర్వహిస్తున్న సమరభేరి కార్యక్రమంలో పాల్గొనటానికి జిల్లాకు విచ్చేసిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం పాల్వంచ నవభారత్ గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ పుష్పగుచ్ఛం, మొక్క అందజేసి ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు.


