ధరణి స్పెషల్ డ్రైవ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ధరణి స్పెషల్ డ్రైవ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కోత్తగూడెం, శోధన న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న ధరణి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆకస్మిక తనిఖీ చేసారు . ఇప్పటివరకు రైతుల నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈనెల తొమ్మిదో తారీఖు వరకు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ లో ఆర్డీవోలు తాసిల్దారులు, ప్రత్యేకశ్రద్ధతో తమ తమ కార్యాలయాల్లో ధరణి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. పాల్వంచ మండలంలో భూమి వివరాలు, సర్వే నంబర్లు, పేర్లు, పాస్ పుస్తకాలలో తప్పులపై ఆరా తీశారు.ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి. ఒక్కటి కూడా పెండింగ్లో ఉండకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డీవో మధు మరియు తాసిల్దార్ వివేక్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.