ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయం పక్కన ఉన్న ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వీవీ ప్యాడ్స్ లో స్లిప్పుల తొలగింపు, అడ్రస్ టాక్స్, ధర్మల్ పేపర్స్ రిమూవల్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈవీఎం, వీవీ ఫ్యాడ్స్ నిల్వ ఉంచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్ట భద్రత కొనసాగించాలని సూచించారు. గోడౌన్ పక్కన ఉన్న పాత బిల్డింగ్ ను పూర్తిగా తొలగించి ఆ ప్రదేశంలో ఎన్నికల ప్రక్రియ సమయంలో కావాల్సిన షెడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎంలు, వీవీ ఫ్యాట్ లు పరిశీలించి తనిఖీ రిజిస్టర్ లో కలెక్టర్ సంతకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు దారా ప్రసాద్, రంగా ప్రసాద్, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్, ఆమ్ ఆద్మీ,బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.