ఆళ్లపల్లితెలంగాణపినపాక నియోజకవర్గంభద్రాద్రి కొత్తగూడెం

ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఆళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

  • రికార్డులపై క్షుణ్ణ పరిశీలన – సిబ్బందిలో కలకలం

పినపాక నియోజకవర్గం, ఏప్రిల్ 4 శోధన న్యూస్ ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఆళ్లపల్లి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు.   కలెక్టర్ తన సందర్శనలో భాగంగా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా  వైద్యుల హాజరు రిజిస్టర్, రోగుల నమోదు వివరాలు, అందిస్తున్న చికిత్స విధానం, మందుల నిల్వలపై ఆయన ఆరా తీశారు.  ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు, రోగులకు అందిస్తున్న సేవల పై  సమీక్షించారు. కొన్ని విభాగాల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం గమనించి సిబ్బందిని మందలించారు. అనంతరం  రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని,  బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, సమయపాలన పాటించాలని కలెక్టర్ సిబ్బందికి  సూచించారు. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. కాగా కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో ఆసుపత్రిలో కొద్దిసేపు కలకలం రేగింది. సిబ్బంది రికార్డులను సక్రమంగా సర్దుబాటు చేసేందుకు తంటాలు పడినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *