ఎస్ఎస్ టి చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఎస్ఎస్ టి చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలకపల్లి మండలం వెళ్ళు మార్గంలో ఏర్పాటుచేసిన ఎస్ఎస్ టి చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు . అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా బిగించనందున వెంటనే సరి చేయాలని, ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించినారు.మండల ప్రజా పరిషత్ స్కూల్ సుబ్బన్నపల్లిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను, జరుగుచున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను తనిఖీ చేసి ఎలక్ట్రిసిటీ పనులు సరిగా లేనందు న ట్రైబల్ వెల్ఫేర్ ఏ ఈ ను మందలించారు. సత్వరమే నిబంధనలకు అనుసరించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాల జగన్నాధపురం లో ఉన్న పోలింగ్ కేంద్రాల ను , అమ్మ ఆదర్శ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో నీటి సౌకర్యం లేదని, టాయిలెట్ లలో నీరు రావడంలేదని, అమ్మ ఆదర్శ పాఠశాల పనులు నత్తనడక సాగుతున్నందున ట్రైబల్ వెల్ఫేర్ ఏ ఈ పై ఆగ్రహించారు. ఎంపీడీవో ని పర్యవేక్షిస్తూ రెండు రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాత గంగారం గ్రామపంచాయతీ వాగొడ్డు గుంపు గుత్తి కోయ ఆవాసము ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పార్లమెంటు ఎలక్షన్లలో గుత్తి కోయ ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. సీతారాంపురం గ్రామపంచాయతీ సుబ్బన్న పల్లి ఆవాసం నందు జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను( పాతూరు చెరువు) పూడికతీత పనిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ పనికి బుధవారం 150 మంది వేతనదారులు హాజరైనారు. వారితో కలెక్టర్ రోజువారి వేతనం రూ 220 వరకు అందుతున్నట్లు వేతనదారులు తెలిపారు. అందుకు జిల్లా కలెక్టర్ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఐదు గంటలు పని చేయడానికి రూ300 అందే విధంగా చూడమన్నారు. అలాగే ఈ నెల 13 న తప్పనిసరిగా వేతన దారులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.