తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

లోక్ సభ ఎన్నికల పై జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు

లోక్ సభ ఎన్నికల పై జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు

భద్రాద్రి కొత్తగూడెం,శోధన న్యూస్: లోక్ సభ ఎన్నికలు-2024 నకు సంబందించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్  ప్రియంక జిల్లా గ్రీవెన్స్ కమిటీ ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ లో  జిల్లా సహకార అధికారి కన్వీనర్ గా ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఆర్ డిఎ , అసిస్టంట్ ట్రెజరీ అధికారులు మెంబర్లుగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సరైన పత్రాలు, ఆధారాలు లేకుండా రూ.50,000 కన్నా ఎక్కువ నగదును అలాగే రూ.10,000 కన్నా ఎక్కువ విలువ చేయు వస్తు సామాగ్రులను తీసుకుని ప్రయాణించవద్దని తెలిపారు. ఒకవేళ అలా జరిగితే అట్టి నగదును ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, పోలీస్ వారు ఎన్నికల నిబంధనల మేరకు సీజ్ చేస్తారని, అట్టి సీజ్ చేయబడిన నగదు విడుదల కొరకు సరైన పత్రాలు, ఆధారాలతో జిల్లా సహకార అధికారి కార్యాలయం, ఎస్1 బ్లాక్, సెకండ్ ఫ్లోర్, జిల్లా సమీకృత అధికారుల కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెంలో  జిల్లా గ్రీవెన్స్ కమిటీ వారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు.  వారు పరిశీలన జరిపిన తర్వాత  అట్టి నగదు ఎన్నికలకు సంబందించిన నగదు కాదని నిర్దారించిన తదుపరి విడుదల చేస్తారని తెలిపారు. ఈ విషయమై ఏమైనా  ఫిర్యాదులు ఉంటే  9100115679 ఫోన్ నెంబర్ కు  కాల్ చేసి కమిటీ కన్వీనర్ ను సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *