ఎస్సై ప్రవీణ్ ను అభినందించిన జిల్లా ఎస్పీ
ఎస్సై ప్రవీణ్ ను అభినందించిన జిల్లా ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ :
హైదరాబాదు లో గల కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు జరిగిన జీ-తెలుగు అవార్డ్స్, తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్-2025 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్న సీసిఎస్ ఎస్ఐ ప్రవీణ్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకొని నిందితులను పట్టుకోవడంలో బాధ్యతగా విధులు నిర్వర్తించినందుకు గాను ఆయన సేవలను గుర్తించి తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్-2025 అవార్డును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ,ప్రజలకు సేవలందించే అధికారులు , సిబ్బందికి ఎప్పటికైనా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో తన వంతు కృషి చేసిన ఎస్ఐ ప్రవీణ్ ను ఈ సందర్భంగా అభినందించారు.