కాలు కోల్పోయిన కానిస్టేబుల్ కు చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ
కాలు కోల్పోయిన కానిస్టేబుల్ కు చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : గత సంవత్సరం డిసెంబర్ నెలలో బూర్గంపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీరామ్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు రూ 7 లక్షల నగదును చెక్కు రూపంలో అందజేశారు. రోడ్డు ప్రమాదానికి గురై కాలు కోల్పోయిన కానిస్టేబుల్ శ్రీరామ్ చికిత్స తీసుకుని కృత్రిమ కాలు ధరించడానికి “సెంట్రల్ ఫ్లాగ్ ఫండ్” నుండి ఈ నగదును జిల్లా ఎస్పీ అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతూ నిత్యం ప్రయాణాలు చేసే పోలీసు అధికారులు, సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విదులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ ఏఓ జయరాజు,సూపరింటెండెంట్ సత్యవతి, ఆర్ఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.