సభస్థలి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
సభా ప్రాంగణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ముత్యాలమ్మనగర్ గ్రామపంచాయితీ ప్రభుత్వ ఐటిఐ కళాశాల మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదీవెన సభ కోసం చేస్తున్న ఏర్పాటు పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం సందర్శించి పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్, హెలిప్యాడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…సీఎం రేవంత్రెడ్డి సభలో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్త్ చర్యలను పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని మణుగూరు డీఎస్పీ వంగ రవీంధర్రెడ్డికి సూచించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి సభకు వచ్చి తిరిగి వెళ్లేంత వరకు ప్రతీ అధికారి, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ వంగ రవీంధర్ రెడ్డి, సీఐలు ఎస్ సతీష్ కుమార్, కరుణాకర్, ఎస్సై రాజేష్ కు మార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.