భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో రేపు శనివారం జరుగనున్న బహిరంగ సభా ప్రాంగణం వద్ద భద్రతా ఏర్పాట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. హెలిపాడ్,పార్కింగ్ స్థలాలను సందర్శించి పట్టణంలో ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి అధికారులకు పలు సూచనలను చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.