తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  ప్రదర్శనను స్వయంగా తిలకించిన జిల్లా ఎస్పీ  

డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  ప్రదర్శనను స్వయంగా తిలకించిన జిల్లా ఎస్పీ  

-సుజాతనగర్ సింగభూపాలెం చెరువులో డిడిఆర్ఎఫ్ బృందంచే రెస్క్యూ ఆపరేషన్ డెమో

-డిఆర్ఎఫ్ బృందం సభ్యులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : రాబోయే వర్షాల దృష్ట్యా సంభవించే వరదలలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న భాదితులను రక్షించడానికి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిఆర్ఎఫ్ బృందం సుజాతనగర్ లోని సింగభూపాలెం చెరువులో రెస్క్యూ ఆపరేషన్ డెమో ప్రోగ్రామ్ నిర్వహించారు.ఈ రెస్క్యూ ఆపరేషన్ను తిలకించడానికి స్వయంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పాల్గొన్నారు.డిడిఆర్ఎఫ్ బృందంలోని సభ్యులు చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించే విధానాన్ని స్వయంగా ఎస్పీ గారు బోటులో ప్రయాణించి వీక్షించారు.ఈ బృందంలోని సభ్యులు చేసిన ప్రదర్శనను తిలకించి ఎస్పీ వారిని ప్రత్యేకంగా అభినందించారు.డిడిఆర్ఎఫ్ బృందానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ఐ సుమంత్ రెస్క్యూ ప్రక్రియ మొత్తాన్ని ఎస్పీ గారికి వివరించారు.జిల్లాలోని ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణను పొందిన డిడిఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ సందర్భంగా తెలియజేశారు.మొత్తం 20 మంది సభ్యులతో ఈ డిడిఆర్ఎఫ్ బృందాన్ని తయారు చేయడం జరిగిందని తెలిపారు.ముఖ్యంగా గోదావరి నది వరదలు సంభవించినప్పుడు నదీ పరిసర ప్రాంతాలలో నివసించే లోతట్టు ప్రజలను సంరక్షించడానికి ఈ బృందం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.రెస్క్యూ సమయంలో అవసరమయ్యే లైవ్ జాకెట్స్,లైఫ్ బాయ్ రింగ్స్,బోట్ పెడల్స్,రోప్స్ మరియు ఇతర సామాగ్రి మొత్తాన్ని ఈ బృందానికి సమకూర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఆపరేషన్స్ ఆర్ఐ రవి, సుజాత నగర్ ఎస్సై జుబేదా మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *