పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ
పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ స్కూల్, సింగరేణి హై స్కూల్ కేంద్రాల్లో బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అధికారులు , సిబ్బందికి పలు సూచనలు చేశారు.పరీక్షలు ముగిసే వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను,ఇన్విజిలేటర్స్,చీఫ్ సూపరింటెండెంట్స్ ను తప్ప ఇతరులను లోనికి అనుమతించరాదని తెలిపారు.