తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నిరుద్యోగులు  దళారుల మాటలు విని మోసపోవద్ధు 

నిరుద్యోగులు  దళారుల మాటలు విని మోసపోవద్ధు 

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి కల్పనా అధికారిణి వేల్పుల విజేత

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ప్రభుత్వం మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీ  విషయంలో నిరుద్యోగులెవ్వరు కూడా  దళారుల మాటలు విని మోసపోవద్ధని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి కల్పనా అధికారిణి వేల్పుల విజేత సూచించారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలలో 155 పోస్టుల భర్తీ కొరకై జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే అన్నారు . దాని కొరకై 5000 మంది కి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.

మెరిట్ ఆధారంగా పోస్టులు ఫిలప్ చేయడానికి సమాయత్తమవుతున్న సందర్భంలో సంబంధిత ఏజెన్సీ వారు పోస్టుల భర్తీ కి సంబంధించిన నోటిఫికేషన్ ను జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ చేయరాదని , తమ ఏజెన్సీ ద్వారానే పోస్టుల భర్తీ జరగాలని , జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వేసిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ హైకోర్టు కు వెళ్లడం జరిగినది.. అయితే దానికి సంబంధించి ఇక్కడ జరిగిన పరిణామాలను ఎందుకు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వేయవలసి వచ్చినదో దానికి కావలసిన పూర్తి సమాచారాన్ని మనం హైకోర్టుకు విన్నవించటం జరిగిందన్నారు.  దానిపై కోర్టు వారి ఆదేశం కోసం ఎదురు చూడటం జరుగుతుందన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పోస్టులన్నీ అభ్యర్థుల అర్హత మరియు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయడం జరుగుతుందన్నారు.  ఇది అందరూ గమనించాలన్నారు. అయితే ఈ పోస్టుల భర్తీ ఆలస్యం అవుతున్న దశ లో కొందరు నిరుద్యోగులను ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. కావున నిరుద్యోగులు ఎవ్వరూ దళారుల మాటలు విని మోసపోవద్దని  తెలిపారు. ఈ పోస్టులు అన్నీ మెరిట్ ఆధారం గానే , వారి అర్హత ఆధారం గానే భర్తీ చేయబడతాయని, కావున డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుందనే అపోహలో నిరుద్యోగులు మోసపోవద్దన్నారు.

ఒకవేళ మేము కోర్టుకు వెళ్ళాము కాబట్టి పోస్టులు మేమే ఫిలప్ చేస్తాము అని ఏజెన్సీ వారు అభ్యర్థుల నుంచి డబ్బులు అడిగినా లేదా జిల్లా అధికారుల నుంచి పోస్టులు భర్తీ చేయడం జరుగుతుందన్నారు.  కాబట్టి మేము జిల్లా అధికారులతో మాట్లాడి మీకు పోస్ట్ ఇప్పిస్తాము , మాకు డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా దళారులు అభ్యర్థులను సంప్రదించినా , అస్సలు డబ్బులు ఇవ్వరాదన్నారు. అలా దళారులకు కానీ ,ఇతర వ్యక్తులకు గానీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని జిల్లా ఉపాధి కల్పనా అధికారిని  వేల్పుల విజేత   కోరారు. ఒకవేళ ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ చేయాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా నిరుద్యోగుల నుంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ సందర్భంగా డబ్బులు తీసుకున్న వారినే కాకుండా డబ్బులు ఇచ్చిన వారు కూడా శిక్షార్హులే అని జిల్లా ఉపాధి కల్పనా అధికారిణి వేల్పుల విజేత ఒక ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *