పల్లె దవఖానాలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
పల్లె దవఖానాలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
-ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం ,శోధన న్యూస్: పల్లె దవాఖానలో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామంలోని పల్లె దవాఖాన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. షుగర్, బి పి. వ్యాధిగ్రస్థులకు ప్రతి నెలా మందులు ఇవ్వాలన్నారు. పాము, కుక్క కాట్లకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఇడిడి చార్ట్ ప్రదర్శించాలన్నారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలు సమయానుసారం చేయించాలని తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.