పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ
కరకగూడెం శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని పోలింగ్ కేంద్రాలను మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి పరిశీలించారు. కరకగూడెం మండల కేంద్రంలోని కొత్తగూడెం, గొల్లగూడెం, చోప్పాల, అనంతారం, పద్మాపురం, చిరుమల్ల, గ్రామపంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను ఏడూళ్ళబయ్యారం సిఐ కరుణాకర్, స్థానిక ఎస్ఐ రాజేందర్ లతో కలిసి మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి పరిశీలించారు. పద్మాపురం గొల్లగూడెం పోలీస్ కేంద్రాలను పరిశీలించి. అక్కడున్న ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా డిఎస్పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు ఒక వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు మాత్రమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడుళ్లా బయ్యారం సిఐ. కరుణాకర్, ఎస్ఐ, రాజేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.