బుగ్గ గ్రామాన్ని సందర్శించిన డీఎస్పి
బుగ్గ గ్రామాన్ని సందర్శించిన మణుగూరు డీఎస్పి
మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామమైన బుగ్గ గ్రామపంచాయతీలో గల బుడుగుల గ్రామాన్ని మణుగూరు డిఎస్పి వంగ రవీందర్ రెడ్డి శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలను నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సంఘవిద్రోహశక్తులకు సహాయం ,ఆశ్రయం కల్పించకూడదని సూచించారు. గ్రామంలో ఏదైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే పోలీస్ శాఖ వారిని సంప్రదించాలని తెలిపారు. మణుగూరు పోలీస్ వారు ఎల్లవేళలా ఉంటామని డిఎస్పీ వారికి తెలిపారు. ఈ కార్యక్రమం లో మణుగూరు సిఐ సతీష్ కుమార్, ఎ స్ఐ రాజేష్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.