ఖమ్మంతెలంగాణ

ప్రశాంతంగా  గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా  గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష

ఏన్కూరు, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా   మండల కేంద్రమైన  ఏన్కూర్ ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉమ్మడి గురు కుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.ఏన్కూరులో తెలంగాణ రా ష్ట్ర గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐదవ తరగతి ప్రవేశ పరీక్షకు 2 88 మంది విద్యార్థినీ విద్యార్థులకు గాను.. 277.మంది విద్యార్దులు హాజరవ్వగా.. 11మంది గైర్హాజరయ్యారు.ఉదయాన్నే జిల్లాలో వివిధ ప్రాంతా ల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలతో ఏనుకూరు చేరుకున్నారు. ఈ పరీక్ష కేంద్రాని కి చీప్ సూపర్డెంట్ గా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి శ్రీనివాసరెడ్డి, డిపార్ట్ మెంట్ అధికారిగా కావూరి పద్మ, సిట్టింగ్ స్కాడ్ గా షేక్ యాకోబు పర్యవేక్షణ చేశా రు.పరీక్ష కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అర్హత పరీక్ష నిర్వహించారు.తల్లిదం డ్రులకే పరీక్ష..తెలంగాణ గురుకుల బాలురు విద్యాలయంలో ఆదివారం నిర్వహించి న గురుకుల ప్రవేశ పరీక్ష (అర్హత)కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు హాజర య్యారు.ఉదయం11.గంటలు నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహి oచగా..పిల్లలతో పాటు వచ్చిన తల్లి-దండ్రులు ఎండలో ఇబ్బందులు పడ్డారు.పరీక్ష కేంద్రానికి సమీపంలోని ఉన్న చెట్ల నీడన తల్లి-దండ్రులు రెండు గంటలపాటు సేద తీ రారు.పరీక్ష రాసి వచ్చిన తమ చిన్నారుల కోసం ఎదురు చూశారు.పరీక్ష పూర్తయిన తరువాత ఎలా రాశారో ఆరాటంగా ప్రశ్నాపత్రాలు చూస్తూ పిల్లలను అడిగి తెలుసు కున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *