ప్రతీ సహాయం ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాలి
ప్రతీ సహాయం ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాలి
- తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
భద్రాద్రి కొత్తగూడెం,శోధన న్యూస్ : వరదల్లో ప్రభుత్వం చేసే ప్రతి సహాయం ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వరదల సంసిద్ధత మరియు సహాయక చర్యలపై గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, జిల్లా ఇన్చార్జి మంత్రి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వ్యవసాయ, మార్కెటింగ్,కార్పొరేషన్, జౌలీ , చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మొదటగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వరదల పై ముందస్తు తీసుకున్న జాగ్రత్తలు మరియు చేపట్టిన చర్యలను మంత్రులకు వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ వరదల వల్ల ఏ ఒక్క ప్రాణ హాని జరగకూడదని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఉన్న అధికారులు అందరికీ వరదల పట్ల అందరికీ అవగాహన ఉందని, దానికి తగినట్టుగా యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకొనిగత ప్రభుత్వం కంటేమెరుగైన సౌకర్యాలు సేవలు ప్రజలకు అందించాలనిమంత్రి తెలిపారు. వరదల్లో వరద బాధితులకు ప్రభుత్వం చేసే ప్రతి సహాయం ప్రజలలో మనోధైర్యాన్ని నింపే విధంగా ఉండాలని ఆయన తెలిపారు. కథలను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, తగినన్ని లాంచీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలకు కావలసిన సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించదని ఆయన తెలిపారు.
అనంతరం జిల్లా ఇంచార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రోడ్లు భవనాల శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖలు అప్రమత్తంగా ఉంటూ డ్రైనేజీలు మరియు రహదారులకు త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు సీజనల్ వ్యాధులు నుండి ప్రజలను కాపాడేందుకు చేపట్టవలసిన చర్యలను ఆరోగ్య శాఖ పెట్టాలని మంత్రి సూచించారు. అన్ని గ్రామాల ప్రత్యేక అధికారులు వరదలపై ప్రజలను సమన్వయ పరచాలని మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి వరదల వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం రైతులకు ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడే మనలోని సమర్థత బయటపడుతుందని, వరదలు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంసంసిద్ధంగా ఉండాలన్నారు.
అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భద్రాచలం రామాలయ పరిసరాలలో వరద నీరు చేరకుండా నీటిని గోదావరిలో ఎత్తిపోసేందుకు తగినర్ని మోటర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావతి ప్రాంతంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు అధికారులు పై అధికారుల ఆదేశాల కోసం చూడకుండా సత్వరమే నిర్ణయాలు తీసుకొని ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని మంత్రి కోరారు. పోలీస్ శాఖఅప్రమత్తంగా ఉంటూవరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం మరియు ఆహార పదార్థాలు అందించడం చేయాలని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, కూనంనేని సాంబశివరావు, భద్రాచలం నియోజకవర్గ శాసనస సభ్యులు, డాక్టర్ తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు రాందాస్ నాయక్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్, జడ్పీ చైర్మన్ కంచికచర్ల చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్వేణుగోపాల్,ఐటీడీఏ పీవో రాహుల్మరియు అన్ని శాఖల అధికారులుతదితరులు పాల్గొన్నారు.