అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత,దళిత హక్కులకు మార్గదర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ డా.భీంరావ్ రాంజీ అంబేడ్కర్,ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది,ఆర్థిక శాస్త్రవేత్త,రాజకీయ నేత, సంఘసంస్కర్త అని,అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి,రాజ్యాంగ శిల్పి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి,అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడని కొనియాడారు.అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా,స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని సూచించారు.