తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

భూసేకరణ పనులు వేగవంతం చేయండి -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ డాక్టర్ ప్రియాంక అల

భూసేకరణ పనులు వేగవంతం చేయండి

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ డాక్టర్ ప్రియాంక అల

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి చేపడుతున్న భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బుధవారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో భూ సేకరణ ప్రక్రియపై రెవెన్యూ,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్, సింగరేణి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్,మొదటి, రెండవ, మూడవ దశ ప్రాజెక్టులకు భూసేకరణ , పులుసుబొంత ప్రాజెక్టు, బిటిపిఎస్ రైల్వే లైన్ మణుగూరు, కరకగూడెం గ్రామాల ప్రజల ఆర్అండ్ఆర్ తదితర అంశాలపై చర్చించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూసేకరణలో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు రైతులతో చర్చించి సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ భూ నిర్వాసితులకు చెల్లించే నష్టపరిహారం రూ 75 కోట్లు సాధ్యమైనంత త్వరగా చెల్లించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు పెండింగ్లో ఉన్న దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో గల ఎనిమిది గ్రామాలను భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వారంలోపు నివేదికను భద్రాచలం ఆర్డీవోకు అందజేయాలని తహ ల్దారులను ఆదేశించారు. పులుసుబొంత ప్రాజెక్టు భూసేకరణన కు సామాజిక,ఆర్థిక సర్వే నిర్వహించి నివేదికను వారం రోజుల్లో భద్రాచలం ఆర్డీవోకు అందించాలని కరకగూడెం తహల్దారును ఆదేశించారు. బిటిపిఎస్ రైల్వే లైన్ మణుగూరు కు మణుగూరు,సమితి సింగారం, రామానుజవరం గ్రామాలలో భూసేకరణ సాధ్యమంత త్వరగా పరిష్కరించి రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా పూర్తి చేయాల్సిన  పనులు పరిహార చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రవీంద్రనాథ్ , బిటిపి ఎస్ సిఈ బిచ్చన్న, ఇరిగేషన్ ఈఈ అర్జున్, ఆర్ అండ్ బి ఈ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, ఎన్ పి డి సి ఎల్ ఎస్సీ రమేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కుసుమకుమారి, నేషనల్ హైవే ఈ ఈ, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయ అధికారులు, సంబంధిత తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *