అభ్యర్థుల ఖర్చులను విధిగా నమోదు చేయాలి
అభ్యర్థుల ఖర్చులను విధిగా నమోదు చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులను విధిగా నమోదు చేయాలని వ్యయ పరిశీలకులు శంకర్ నంద మిశ్రా సూచించారు. శనివారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తో వ్యయ పరిశీలకులు శంకర్ నంద మిశ్రా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ చేసిన నాటి నుండి పోలింగ్ జరిగే వరకు ప్రతి రూపాయి ఖర్చును వ్యయ పరిశీలకుల బృందాలు నమో దు చేయాలని సూచించారు. అన్ని బృందాలు సమన్వయంతో పని చేయాలన్నారు. డబ్బు మద్యం ప్రలోభాలకు లొంగకుండా ప్రజలను చైతన్యపరచాలన్నారు. బ్యాంకు ఖాతాలను, డిజిటల్ లావాదేవీలను తనిఖీ చేయాలన్నారు.