తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలి
తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలి
హన్మకొండ ,శోధన న్యూస్: ఎల్కతుర్తి మండలంలోని గ్రామాల్లో సమయానికి సాగు నీరు అందక చాలా మంది రైతుల పంటలు ఎండి పోయాయి అని ఎండి పోయిన పంటలకు ఏకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ..ఎల్కతుర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి అధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ అందుబాటులో లేని కారణంగా సీనియర్ అసిస్టెంట్ నెహ్రూ కీ వినతిపత్రం అందచేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లు ప్రారంభమైనందున తక్షణమే పూర్తి స్థాయిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతోపాటు క్వింటాలుకు రూ.500 రూపాయలు బోనస్ ప్రకటించాలని ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలన్నారు. ప్రతి ఏటా తాలు, తేమ, తరుగు పేరుతో క్వింటాలుకు 4 నుండి 6 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారు. మిల్లర్లతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినందున వెంటనే ఆ మేరకు కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతోపాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానక్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్ ను ఏర్పాటు చేయాలి. సమగ్ర పంటల బీమాన అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలి. కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలి. పై అంశాలను గౌరవ జిల్లా కలెక్టర్, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ద్రుష్టికి తీసుకెళ్లి తక్షణమే అమలయ్యేలా చూడాలని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరడం జరిగింది,, ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పల్లేపాటి మధుకర్, చిదురాల వెంకటేష్, పెరుగు మధు, కుడుతాడి కరుణాకర్, కొడం రమేష్, సాయి తేజ,తదితరులు రైతులు పాల్గొన్నారు.