తెలంగాణహైదరాబాద్

ప్రజాప్రభుత్వంలో రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే రికార్డు

ప్రజాప్రభుత్వంలో రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే రికార్డు

-తెలంగాణ రైతుల పట్ల చిత్తశుద్ధికి  రుణామాఫినే  నిదర్శనం

-సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, శోధన న్యూస్ :  భారతదేశ చరిత్రలో  ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా పెద్దమొత్తం లో  రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి ఏనుముల  రేవంత్ రెడ్డి   అన్నారు. తొలి విడతలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని సిఎం తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును సిఎం రేవంత్రెడ్డి  రైతులకు అందజేశారు. మంగళవారం  మధ్యాహ్నం 12 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మాట ఇచ్చిన విధంగా ఆగస్టులోనే మూడో విడత చేపట్టి మొత్తం రూ.31వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ చరిత్రలో  స్వల్ప వ్యవధిలో   రైతులకు రుణమాఫీ చేసిన   ఘనత తెలంగాణ ప్రజాప్రభుత్వానికే దక్కడం గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు.  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల దృష్టితో చూడబోదని, అన్నదాతలు బాగుండాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి  తెలిపారు.నాటి నెహ్రూ   కాలం నుంచీ నేటి రాహుల్ గాంధీ తరం వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రపొడవునా రైతు పక్షపాతిగానే కొనసాగుతోందని అన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం పదేండ్లలో పట్టుమని లక్ష రూపాయాల రుణమాఫీ కూడా సజావుగా చేయలేకపోయిందని, గత పాలకులు రాష్ట్రంపై మోపిన అప్పుల భారాన్ని నిభాయిస్తూనే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.2లక్షల రుణమాఫీని అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి తెలిపారు.  రైతు రుణమాఫీ కోసం 12 రోజుల్లోనే రూ.12వేల కోట్లు సమకూర్చిన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జులై 18న మొదటి విడతలో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో రూ. 6034.96 కోట్లు జమకాగా,  జులై 30న రెండవ విడతలో 6,40,223 మంది రైతుల ఖాతాల్లో రూ. 6190.01 కోట్లు జమ అవుతున్నాయన్నారు. ఆగస్టు పూర్తయ్యేలోపే చివరిదైన మూడవ విడతలో 17,75,235 మంది రైతుల ఖాతాల్లో రూ.12224.98 కోట్లు జమ చేయడంతో రూ.2లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తికానుందన్నారు.

ఈ  కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , దామోదర రాజనర్సింహ , కొమటిరెడ్డి వెంకటరెడ్డి , కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సీతక్క , పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *