కరీంనగర్తెలంగాణ

పోలీసుల  ఫ్లాగ్ మార్చ్ 

పోలీసుల  ఫ్లాగ్ మార్చ్ 

కరీంనగర్, శోధన న్యూస్: రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ కు వచ్చిన సీఐఎస్ఎఫ్ బలగాలతో బుధవారంనాడు టూ టౌన్ పోలీసు స్టేషన్ ల పరిధిలో, గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా గుర్తించిన పలు సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ ఫ్లాగ్ మార్చ్ కరీంనగర్ గీతాభవన్ తెలంగాణ చౌక్ వద్ద ప్రారంభమై అతిధిగృహం మీదుగా, కోర్టు చౌరస్తా నుండి మంచిర్యాల చౌరస్తా వద్ద ముగిసింది. ఈ ఫ్లాగ్ మార్చ్ నందు సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు, స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *