మణుగూరు మదీనా నగర్ లో మదర్సా నిర్మాణానికి శంకుస్థాపన
మణుగూరు మదీనా నగర్ లో మదర్సా నిర్మాణానికి శంకుస్థాపన.
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని మదీన నగర్ మక్కా మసీదు ప్రాంగణంలో చిన్నారులకు చెడు అలవాట్లకు దూరంగా మంచి విద్యాబుద్ధులు నేర్పించుటకు గాను మదర్సా నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దారుల్ ఉలూమ్ మణుగూరు ఆధ్వర్యంలో గొప్ప ఇస్లాం ధార్మిక బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హజ్రత్ మౌలానా, మహమ్మద్ సయిద్ అహమ్మద్ సాహెబ్ ఖురేషి అధ్యక్షత వహించారు. దివ్య ఖురాన్ కంఠస్థం పరిపూర్ణంగా పూర్తి చేసిన విద్యార్థులను సభకు హాజరైన ముఖ్య వక్తలు ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం వక్తలు అబ్దుల్ వాహబ్ సాహెబ్ నెల్లూరు, అబుబకర్ జాబిర్ సాహెబ్ లు మాట్లాడుతూ.. మణుగూరు పట్టణం మదీనా మజీద్ ప్రాంగణంలో మదర్సా ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామం అన్నారు. ముస్లిం సోదరులందరూ తమ పిల్లలను మదర్సా కు పంపాలన్నారు. పవిత్ర ఖురాన్ లో పొందుపరచబడిన నియమ నిబంధనలను చిన్నతనం విద్యార్థులు నేర్చుకుంటారన్నారు. అదేవిధంగా సమాజంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలో మదర్సాలో నేర్పించడం జరుగుతుందన్నారు. అలాగే తల్లిదండ్రుల పట్ల,పెద్దలపట్ల గౌరవం గా ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా అబ్బాస్ సత్తార్ సాహెబ్, కరీం సాహెబ్, ఇనాయతుల్లా సాహెబ్ మత పెద్దలు, స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.