దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
దుమ్ముగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు దుమ్ముగూడెం మండలంలోని నారాయణరావుపేట గ్రామపంచాయతీలో గల సిరిగుండం ఆదివాసి గుత్తి కోయ గ్రామంలో దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దుమ్ముగూడెం స్థానిక పిహెచ్ సి వైద్య సిబ్బంది సహకారంతో సిరిగుండం గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి,మందులను అందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన, మారుమూల వర్గాలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.ఈ కాలంలో వర్షాలు అధికంగా పడి దోమల వలన డెంగీ,మలేరియా వంటి విషపూరిత జ్వరాలు ప్రభలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఏదైనా అత్యవసరమైతే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించి సహాయం పొందాలని తెలిపారు.దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల చేత గ్రామంలోని చిన్నపిల్లలకు,పెద్దలకు, వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి,అవసరమైన మందులను వారికి ఉచితంగా అందచేయడం జరిగింది.గ్రామంలో నివసిస్తున్న 52 కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను పొందారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దుమ్ముగూడెం పోలీసులను ఏఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ అశోక్,దుమ్ముగూడెం పిహెచ్ సి డాక్టర్ పుల్లారెడ్డి,ఎస్సై గణేష్,ఆర్ ఎస్ఐ హరీష్ , స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.