చెరువులో పేరుకుపోయిన చెత్తను,పూడిక ను తోలగించాలి
చెరువులో పేరుకుపోయిన చెత్తను,పూడిక ను తోలగించాలి.
జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం,శోధన న్యూస్: చెరువుల్లో పేరుకుపోయిన చెత్తను పూడిక తీయడం ద్వారా చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం పెరగడంతో పాటు రైతు పొలల్లో సారవంతమైన ఎరువుకు ఉపయోగపడుతుందని ఇట్టి ప్రక్రియను పారద్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి వ్యవసాయ, ఇర్రిగేషన్ శాఖల అధికారులతో చెరువుల పూడికతీత, రైతుల అవసరాలకు చెరువుమట్టి సరఫరాపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..చెరువులలో పేరుకుపోయిన పూడికను తొలగించడం వల్ల చెరువు నీటి నిల్వ సామర్ధ్యం పెరగడంతో పాటు పూడిక ద్వారా తీసిన మట్టిలో పంటలకు కావలసిన పౌష్టికమైన ధాతువులు పంట దిగుబడికి దోహదపడతుందన్నారు. ఈ సమాచారం రైతులకు తెలపాల్సిన అవసరం ఇర్రిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులపై ఉందన్నారు. అవసరమైన రైతులు తమ పరిధిలోని రైతువేదికలలో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి తమ అవసరాలకనుగుణంగా వివరాలను దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులు ఇర్రిగేషన్ శాఖ అధికారుల వద్దకు వెళ్లాల్సిలన అవసరం ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు వివరాలను ఇర్రిగేషన్ శాఖ అధికారులకు వివరాలను తెలియజేసి సారవంతమైన, పూడిక తీసిన మట్టిని సమకూర్చడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.