సత్తుపల్లిలో ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి
ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి
సత్తుపల్లి, శోధన న్యూస్ : జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బాలికల హాస్టల్లో రమాబాయి అంబేద్కర్ 126వ జయంతిని పే బ్యాక్ టు సొసైటీ ఖమ్మం జిల్లా యూనిట్ గురువారం ఘనంగా నిర్వహించారు. జేవియర్ కళాశాల చరిత్ర అధ్యాపకులు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో అంబేద్కర్ జీవితం ,రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశం పై వక్త కొచ్చర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలందరూ రాజ్యాంగంలోని హక్కుల గురించి తెలుసుకోవాలని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, రాజ్యాంగాన్నిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. అంబేద్కర్ రమాబాయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దారా ఏసురత్నం,లాయర్ సుదర్శన్ , వార్డెన్ మాధవి , గుంట్రు సూర్యం, మిరియాల రవి తదితరులు పాల్గొన్నారు.