తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ ముగింపు కార్యక్రమం

గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ ముగింపు కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజులపాటు జరిగిన గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణా ముగింపు కార్యక్రమం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ శిక్షణను సుమారుగా 150 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పొందారు. ముందుగా ఓఎస్డి సాయి మనోహర్  పోలీస్ అధికారులకు, సిబ్బందికి వారం రోజులు పాటు జరిగిన ఈ శిక్షణ షెడ్యూల్ ను ఎస్పీ కి వివరించారు. అనంతరం ఎస్పీ   ఈ శిక్షణలో వారం రోజులుగా పాల్గొని నేర్చుకున్న కొత్త విషయాలను గురించి,  మెలకువలను గురించి అధికారులను, సిబ్బందిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి వారం రోజులు పాటు ప్రత్యేక శిక్షణను అందించిన గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు,చెక్పోస్ట్ ల వద్ద విధులు,వాహనాల ముమ్మర తనిఖీ , ఇతర పోలీస్ సంబంధిత విధుల నిర్వహణ కొరకు ఈ ప్రత్యేక శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం రోజువారి వీధులకు సంబంధించి అధికారులు మరియు సిబ్బందికి తలెత్తుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అట్టి సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని వారికి తెలిపారు. పోలీస్ శాఖలో బాధ్యతగా,నిబద్దతో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *