అర్హులందరికీ గృహజ్యోతి అమలు
అర్హులందరికీ గృహజ్యోతి అమలు
-పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్:ఎన్నికల కోడ్ ముగియడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అర్హులైన వారందరికీ నేటి నుండి గృహ జ్యోతి పథకం అమలు అవుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మాట్లాడుతూ…గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్లు లోపు జీరో బిల్లులు ప్రభుత్వం జారీ చేస్తుందని, అర్హులైన పేదలు అందరికీ పార్టీలకతీతంగా ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వెనకడుగు వేసేది లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విమర్శలను ప్రజలు పెడచెవిన పెట్టారని, చక్రం తిప్పుతానన్న నేతలను జీరో చేశారన్నారు.