సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ పై మార్గదర్శకాలు విడుదల చేయాలి
సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ పై మార్గదర్శకాలు విడుదల చేయాలి
మణుగూరు, శోధన న్యూస్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా టీబీజీకేఎస్ బ్రాంచ్ ఇంచార్జ్ నాగేల్లి వెంకట్ డిమాండ్ చేశారు. పినపాక నియోజకవర్గం లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలన్నీటిలో సిబిఎస్ఇ అమలు చేస్తున్నారని అన్నారు బిపిఎల్, హేవివాటర్ ప్లాంట్ కు చెందిన పాఠశాలలో ఇప్పటికే సిలబస్ అమలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యనందిస్తున్నాయని అన్నారు. 49 శాతం కేంద్ర వాటా ఉన్న సింగరేణిలో సీబీఎస్ఈ సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ ఎందుకు ప్రవేశపెట్టరని ప్రశ్నించారు. స్కూల్ రీ ఓపెనింగ్ సమయానికి సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ అమలు కోసం యాజమాన్యం కసరత్తు ప్రారంభించినప్పటికీ నేటి వరకు అమలుకు నోచుకోక పోవడం, విధి విధానాలు ఖరారు కాకపోవడం తో కార్మికుల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని యాజమాన్యం వెంటనే సి బి యస్ ఈ సిలబస్ పై మార్గదర్శకాలు విడుదల చేయాలని యాజమాన్యాన్ని అయన డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో అన్ని కార్మిక సంఘలు తమ మేనిఫెస్టోలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. గెలిచిన గుర్తింపు సంఘం ప్రాథమిక సంఘాలు సెంట్రల్ సిలబస్ అమలు చేసే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని అన్నారు. సెంట్రల్ సిలబస్ అందుబాటులో లేని కారణంగా కార్మికులు పిల్లలను దూరప్రాంతాల్లో చదివిస్తున్నారని అన్నారు. 2024-2025 సంవత్సరానికి సింగరేణి పాఠశాలలో సి బియస్ ఈ సిలబస్ ప్రారంభమవుతుందని కార్మికులందరూ ఎంతగానో సంతొషం వ్యక్తం చేసినప్పటికీ నేటి వరకు విధివిధానాలు ఎలాంటివి ఖరారు కాకపోవడంతో కార్మికులందరూ నిరుత్సాహంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సి బి యస్ ఈ సిలబస్ ప్రవేశపెట్టడం తో పాటు అందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన యాజమాన్యం కోరారు.