తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులు,సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదివారం  హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త రంగులతో అనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఈ హోలీ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *