జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కోతగుడెం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. తెలుగువారి పండుగలన్ని చాలా అద్భుతంగా ఉంటాయని, వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగని తెలిపారు. ఉగాది పండుగ రోజున తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారంతో తయారు చేసిన పచ్చడిని ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారని చెప్పారు. ఉగాది పచ్చడిలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలన్నిటికీ పచ్చడి ప్రతీక అని చెప్పారు. ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉందని, అనగా ఈ ఏడాది ప్రారంభమని చెప్పారు. తెలుగువారికి ఉగాది పండుగతోనే సంవత్సరం ప్రారంభం అవుతుందని, సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి, చెడులను, కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుందని ఆమె చెప్పారు. ప్రజలు సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.