వయో పరిమితి పెంపు సర్క్యులర్ విడుదల పట్ల హర్షం
సింగరేణి వారసత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపు సర్క్యులర్ విడుదల హర్షం
మణుగూరు, శోధన న్యూస్ : సింగరేణి వారసత్వ ఉద్యోగుల నియామక వయో పరిమితి 35 నుండి 40 ఏళ్లకు పెంపు సర్క్యులర్ విడుదలపై సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్ టియ సి) మణుగూరు ఏరియా బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి సిల్వేరు గట్టయ్య లు హర్షం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీ ఐఎన్ టి యు సి కార్యాలయంలో మంగళ వారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, సబంధిత శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కి, సింగరేణి సిఎండి బలరాం నాయక్ కి , ఐఎన్ టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బి జనక్ ప్రసాద్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు.
సింగరేణి కార్మిక గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్ టియుసి ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఈ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరినట్లుగా వారు అభివర్ణించారు. 35 ఏళ్లకు వయసు పైబడి ఉద్యోగాలు రావని నిరాశ, నిస్పృహలతో ఉన్న డిపెండెంట్ లకు 40 ఏళ్లకు వయోపరిమితి పెంపు సర్క్యులర్ ఎంతగానో లబ్ధి చేకూర నుందని వారు తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని, కోడ్ ఎత్తివేసిన వెంటనే సర్క్యులర్ జారీ అయిందని ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించాలని ఎలాంటి షరతులు లేకుండా, కొర్రి పెట్టకుండా వయోపరిమితి పెంపు సర్క్యులర్ అమలు చేయాలని వారు సింగరేణి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరపాక రాములు,షేక్ మస్తాన్, మిద్దెపాక శ్రీనివాస్, జయరాజు తదితరులు పాల్గొన్నారు.