తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు: ఐఎండి
తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు: ఐఎండి
హైదరాబాద్, శోధన న్యూస్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాగల 5 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.