రేపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు -భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్ ప్రియాంక అల
రేపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు
–భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : మేడారం శ్రీ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా రేపు శూరవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. తెలంగాణ కుంభమేళా మేడారంలో జరిగే శ్రీ సమ్మక్క సారక్క జాతరలో ముఖ్యఘట్టమైన 23న సమ్మక్క సారక్క రాకను పురస్కరించుకొని జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొనే అవకాశం ఉన్నందున స్థానిక శాసనసభ్యులు, విద్యార్థి , ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు రేపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకల పేర్కొన్నారు. రేపు సెలవుకు బదులుగా మార్చి 9 వ తేదీన రెండవ శనివారంను పని దినముగా ఉంటుందని ఆమె తెలిపారు.