మొక్కల పెంపకం తోనే మానవ మనుగడ
మొక్కల పెంపకం తోనే మానవ మనుగడ
- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్ : మొక్కల పెంపకం తోనే మానవ మనుగడ సాధ్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలకేంద్రంలో ప్రభుత్వ అధికారులతో కలిసిపినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రజా భవన్(ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం)లో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అడవులతోనే మానవ మనుగడ ముడిపడి ఉందన్నారు. అడవులను రక్షించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా వాతావరణం లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, తద్వారా వర్షాబావ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి ఆరు మొక్కలు నాటాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం లో తహశిల్డర్ రాఘవరెడ్డి , ఎంపీడీఓ శ్రీనివాసరావు, మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.