మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
– కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి
కరీంనగర్ ,శోధన న్యూస్: జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా వ్యవహరించి సహాయ సహకారాలను అందిస్తానని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం రభీ కొనుగోలుపై మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలులో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, ఇకపై కూడా అదే విధంగా కొనుగోలు జరిగేలా మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు. ధాన్యం కొనుగోలులో ఖచ్చితంగా ఎఫ్. ఏ.క్యు. ప్రమాణాలను పాటించాలని తెలిపారు. కాప్రా పురుగు వల్ మిల్లర్లు ఎదుర్కొనే సమస్యలపై ఎఫ్ సి ఐ అధికారుల సమీక్షిస్తానని అదేవిధంగా హమాలీ ట్రాన్స్పోర్ట్ తదితర ఇబ్బందులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రబీలో బాయిల్డ్ రైస్ మాత్రమే చేయడానికి మిల్లర్లు ముందుకు రావడంతో వారి నుండి రిప్రజెంటేషన్ తీసుకున్న కలెక్టర్ దానిని పై అధికారులకు పంపిస్తానని పేర్కొన్నారు. రానున్న రబీ కొరకు మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇప్పటినుండే చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో మిల్లులను తనిఖీ చేస్తానని ఆమె తెలిపారు. ప్రతిరోజు 3873 మిల్లింగ్ టార్గెట్ జరిగేలా చూడాలని, మిల్లింగ్ లో వెనుకబడిన మిల్లర్లు ప్రగతిని సాధించాలని ఆమె పేర్కొన్నారు. గన్ని సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు, అదేవిధంగా జిల్లాలో 341 కొనుగోలు కేంద్రాలకు ఇన్చార్జీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అధికారులు మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించి రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.