తెలంగాణపినపాక నియోజకవర్గంభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

విజయభేరి మోగించిన  సిద్దార్థ ఒకేషనల్  విద్యార్థులు 

విజయభేరి మోగించిన  సిద్దార్థ ఒకేషనల్  విద్యార్థులు 

పినపాక నియోజకవర్గ ప్రతినిధి, ఏప్రిల్ 13 (శోధన న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మణుగూరు సిద్దార్థ ఒకేషనల్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో  విజయఢంకా మోగించారు. ద్వితీయ సంవత్సరం ఎంపిహెచ్‌డబ్ల్యూ (ఎఫ్) విభాగంలో 1000 మార్కులకు గాను వై. గీతామాధురి 961 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సి.హెచ్. మంజు 952, డి. సలోమి 950, కె. రమ్య 919 మార్కులు సాధించారు. ఎంఎల్టీ విభాగంలో పి. ఆనంద్ 924 మార్కులు, ఎల్ విభాగంలో ఎం. ఉదయశశాంక్ 903 మార్కులు సాధించారు. అలాగే ప్రథమ సంవత్సరం ఎంపిహెచ్‌డబ్ల్యూ (ఎఫ్) విభాగంలో 500 మార్కులకు గాను బి. నందిని 494 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. ఎం. దేవిక 468, కె. మణిదీపిక 460, నాగశోభిత 431, కె. గాయత్రి 425, బి. శ్రీహర్ష 447 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వల్లభనేని అజయ్‌కుమార్ మాట్లాడుతూ, తమ విద్యార్థులు ఒకేషనల్ ఫలితాల్లో డివిజన్ స్థాయిలో మంచి ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, వారికి ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కృష్ణవేణి, సబాహత్, చంద్రకళ, విజయ, రాము, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *