ఏడూళ్ల బయ్యారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజ్ కుమార్
ఏడూళ్ల బయ్యారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజ్ కుమార్
పినపాక, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ(ఎస్సై) గా ఇమ్మడి రాజ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం జరిగిన సాధారణ బదిలీలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ విధులు నిర్వర్తిస్తున్న ఇమ్మడి రాజ్ కుమార్ ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐ రాజ్ కుమార్ బూర్గంపాడు ఎస్సైగా ఉత్తమ సేవలందిస్తూ ప్రజల చేత శభాష్ ఎస్సై రాజ్ కుమార్ అనిపించుకున్నారు. బదిలీలో భాగంగా ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ సేవలందించనున్న ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.