డిఎస్సి పరీక్ష కేంద్రం వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అమలు
డిఎస్సి పరీక్ష కేంద్రం వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అమలు
- కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా పరిధిలో జులై 18 నుంచి ఆగష్టు 5 వరకు జరిగే డిఎస్సి పరీక్షల నేపథ్యంలో అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ చట్టం -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ తెలిపారు. జులై 18 తేది నుండి ప్రతి రోజు రెండు సెషన్‌లలో, ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5వరకు డిఎస్సి పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షా సమయంలో సాయంత్రం 6 వరకు సెక్షన్ 163 అంక్షలు అమలులో ఉంటాయని, పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాలలో పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సంబంధిత నిఘా ను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.