మారుతీ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం
మారుతీ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని గుట్టమల్లారం గ్రామంలో సంతోష్ మారుతీ వారి సర్వీస్ సెంటర్ ను ముఖ్య అతిధిగా విచ్చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటెశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించి సంతోష్ మారుతీ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణుగూరు సబ్ డివిజన్లోని కారు వినియోగదారులకు నాణ్యమైన సామాగ్రిని అందిస్తూ.. విశేష సేవలను అందించాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును సంతోష్ మారుతీ యాజమాన్యం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామా శ్రీనివాసడ్డి, దొబ్బల వెంకటప్పయ్య, ఎంపిటిసి గుడిపూడి కోటేశ్వరరావు, గాండ్ల సురేష్, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు కొర్సా ఆనంద్, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంతోష్ మారుతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.